2007/08/28

మీకు తెలుసా: మీ సీటిలో పేలుళ్లు .. మీరు ఏమి చేయాలి

హైదరాబాద్ లో జరిగిన పేలుళ్లు అత్యంత బాధాకర సంఘటన. ఇది మనందరికి సవాల్ గా నిలిచింది. ఇలాంటి సంఘటనలు పునరావూతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనా, సమాజంపైనా ప్రధానంగా యువతపై ఉంది. వాటిని మన బ్లాగ్గులు చాలా బాగా విశ్లేషించారు. కాని మనం ఏమి చేయాలి.

*గాయపడిన వారికి సాయం చేద్దాం.

*పేలుళ్లు జరిగినప్పుడు మనం ఆప్రమత్తముగా ఉండి, ఒనర్ లేని బ్యాగులు గురించి పోలీసులుకి ఫోను చేద్దాం.

*రాజకీయ బంద్ లకు దూరంగా ఉండి, సంఘిభావం ప్రకటింతము. తీవ్రవాదుల దుశ్చర్యకు అనవసరంగా ప్రాధాన్యం పెరగకుండా చూద్దాం.

*వైద్యశాలకు సహయం చేద్దాం.

*ఐకమత్యానికి అసలు చావన్నదే లేదు, మీకు మేము కూడా ఉన్నాము అని నీ చేయి అసరా ఇవ్వు.

సుమారు కోటిన్నరమంది చూసిన 'యూ ట్యూబ్' వెబ్ సైట్ లోని 'బ్యాటిల్ ఎట్ క్రూగర్' వీడియ్ కధ చూడండి. ఇది ఐకమత్యపు బలాన్ని మరోసారి చాటిన కధ. 'టీమ్ వర్కు' కు సాదించిన విజయం. ఈ కధ గురించి ఈనాడు లో కూడా వచ్చింది, చదవండి.

దున్నపోతుల సమాజం మేలుకుంది. తోటి జీవిపై జరిగిన దాడి వాటిని స్పందింపజేసింది. ప్రతీకారేచ్ఛ రగిలింది. కొమ్ముల్లోకి కొత్తశక్తి ప్రవాహించింది. ఆలోంచి, ఒక్కొక్కటే కదిలాయి. పక్కా ప్రణాళికతో నడుస్తున్నట్టుగా.. సమర్ధుడైన నాయకుడు దారిచూపుతున్నట్టుగా.. సూన్-జు యుద్ధకళ( ఆర్ట్ ఆఫ్ వార్) కు తామే స్ఫూర్తి అయినట్టుగా.. పదులకొద్దీ దున్నలు. సింహుల తుక్కు రేగ్గొట్టాయి.. చూడండి.



చివరిగా: దున్నపోతుల సమాజం మేలుకుంది, మన సమాజం ఎప్పుడూ మేలుకుంటుంది. ఆది త్వరలో మనం చూడాలి అని అశిస్తూ .. మీ మరమరాలు.

2 అభిప్రాయాలు:

Anonymous said...

చాలా మంచి టపా...

దున్న పోతుల సమాజంలో ...ముస్లిం దున్నపొతులు లేవు, ఎలక్షన్లు లేవు, ఓటు రాజకీయాలూ లేవు...వుంటే, పరిస్తితి వేరేగా వుండేది. చిన్న పంది పిల్లకు కూడ భయపడి పోయేవి.

దున్న పోతుల సమాజంలో ... ప్రమాదంలో వున్న ' మనలో ' ఒక్కడిని రక్షించుదాం అనే తపన వుంది, స్వార్ధం లేని ఐకమత్యం వుంది, స్వశక్తి పై నమ్మకం వుంది.

ఇవన్నీ మన సమాజం నుండి ఆశించడం అత్యాశేమో అనిపిస్తోంది.

-శేఖర్

Burri said...

శేఖర్ గారి వాఖ్యలకు ధన్యవాదాలు

Post a Comment

Thank you for your comments