2008/01/30

మంచి మాట - 23


సత్యం ఒక్కటే మానవ జీవితాన్ని సన్మార్గంలోకి తీసికొనివస్తుంది.
- మహాత్మాగాంధీ

2008/01/26

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, మంచి మాట - 22బంగారాన్ని గాని, గంధాన్ని గాని ఏం చేసినా వాటి గుణం మారుదు. అదే విధంగా ఉత్తముడికి ఎన్ని కష్టాలు వచ్చినా అతని ఉత్తమ గుణం మారుదు.

- జవహర్ లాల్ నెహ్రూ

2008/01/19

జార్జ్ 'ఎవరెస్ట్'ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వతం ఏది అంటే ఎవరెస్ట్ అని ఠక్కున చెబుతాం. ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే మాత్రం.. సమాధానం దొరకదు. ఇంతకీ ఈ పర్వతరాజుకు ఆ పేరు ఎలా వచ్చింది? భారతదేశ భౌగోళిక స్వరూపాన్ని శాస్త్రీయంగా లెక్క గట్టీ పటాలను రూపొందించే ప్రక్రియ ఆంగ్లేయుల పాలనలో తొలిసారిగా మొదలైంది. గ్రేట్ ఆర్క్ అనే సంస్ధకు ఈ బాధ్యతను అప్పగించారు. ఆ సంస్ధ సర్వేయర్ జనరల్ సర్ జార్జ్ ఎవరెస్ట్ (1790-1866) ఆధ్వర్యంలో పనులు మొదలైనాయి. అన్ని ప్రాంతాలను లెక్కిస్తూ.. ఓ పెద్ద పర్వతం దగ్గరికి వచ్చారు. లెక్కలు పూర్తయ్యాక తేలిందేమంటే ప్రపంచంలోనే దాన్ని మించింది లేదని. ఇక పేరు పెట్టటం మిగిలింది. అప్పటికే స్ధానికులు రకరకాల పేర్లతో దానిని పిలుస్తున్నప్పటికీ.. ఆంగ్లేయుల ప్రామాణికంగా ఒక పేరు లేదు. ఈ నేపధ్యంలో.. ఆ పర్వతానికి జార్జ్ ఎవరెస్ట్ పేరుమీదుగా.. మౌంట్ ఎవరెస్ట్ అని పిలవాలని ఒక ఉద్యోగి సూచించారు. అందరూ ఆమోదించటంతో.. ఆ పేరే నిలిచిపోయింది.

2008/01/11

వాళ్లనుకున్నట్లు జరిగి ఉంటే?"అనుకున్నామని జరగవు అన్నీ... అనుకోలేదని ఆగవు కొన్ని" అన్న కవి మాటలు ప్రపంచ ప్రసిద్ది చెందిన కావెండిష్ ల్యాబరేటరీ శాస్త్రవేత్తలకు తెలిసినట్టు లేదు. 1897లో ఈ పరిశోధనశాలలో మొట్టమొదటిసారి ఎలక్ట్రాన్ ను నోబెల్ బహుమతి గ్రహీత సర్ జె.జె. ధామస్ (1856-1940) గుర్తించారు. ఆ తరువాత జరిగిన ఓ విందు సమావేశంలో కావెండిష్ ల్యాబరేటరీ శాస్త్రవేత్తలంతా మూకుమ్మడిగా అనుకున్న సంగతేమిటో తెలుసా? "The electron - may it never be of use to anybody" అంటే మేం కనుక్కున్న ఎలక్ట్రాన్ ప్రపంచంలో ఎవరికీ అక్కరకు రాకుండా ఉండుగాకా అని! ఎలక్ట్రాన్ వల్ల ప్రయోజనమేమీ ఉండదని వారు భావించడమే దీనికి కారణం. కానీ ఆ తరువాతికాలంలో ఈ ఎలక్ట్రానే... ప్రవాహంగా మారి విద్యుత్తును... తద్వారా నేటి ఆధునిక జీవితాన్ని ఇచ్చింది!

2008/01/03

మంచి మాట - 21


వేలాది మంది శాస్త్రవేత్తలు.. రకరకాల పరిశోధనలు.. దేశ విదేశ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంపై పరస్పర అవగాహనకు సమయం ఆసన్నమైంది. 1914 నుంచి ఏటా ఈ సైన్స్ సంబరాలు దేశంలోని వివిధ యూనివర్శిటీల్లో జరుగుతునే ఉన్నాయి. 1976లో ఈ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలకు వేదిక అయిన ఆంధ్రా యూనివర్శిటీ మళ్లీ 31 సంవత్సరాల తరువాత తిరిగి ఈ సమావేశాలకు ఆతిధ్యమిస్తోంది.
మన దేశంలో ఏ రంగంలో ప్రగతి సాధించినా దాని ఫలితాలు అందరికీ సమానంగా దక్కాలి. అప్పుడే నేను ఆ ప్రగతిని గుర్తిస్తాను.

- మహాత్మాగాంధీ