2008/12/25

మహాత్మాగాంధీ, మంచి మాట - 27మనుషులను వారి డీగ్రీలను, మేధోసంపత్తిని చూసి అంచనా వేయకండి. అతని మనసును, ఆలోచనా విధానాన్ని బట్టి అంచనా వేయండి.
- మహాత్మాగాంధీ


2008/12/14

యుద్దం వల్లన సైన్స్ చరిత్రకు జరిగిన అపార నష్టం..పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడి... ముంబయిపై పాక్ ఉగ్రవాదుల దాడి... జరిగిన తరువాత ప్రతి భారతీయుడు పాకిస్ధాన్ పై యుద్దం ప్రకటించాలి అని, ఎన్నాళ్ళిలా అని అడుగుతున్నారు. ఇలాంటి సందర్భములోనే మనం యుద్దం వల్లన సైన్స్ చరిత్రకు జరిగిన అపార నష్టం గురించి మనం చెప్పుకోవాలి.

సైన్స్ ప్రయోగాలు చేసిన ప్రతిసారి యురేకా... అంటూ ప్రఖ్యాత గ్రీకు గణితశాస్త్రవేత్త
ఆర్కిమెడిస్ (క్రీ.పూ. 287-212) జీవితం ఉజ్వలంగా గడిచినప్పటికీ... మరణం మాత్రం అనామకంగా సంభవించింది. ఆ కాలంలో గ్రీకు, రోమన్ నగరాల మధ్య యుద్ధాలు జరుగుతుండేవి. అదేవిధంగా ఒకనాడు సిరాక్యుస్ నగరం పైకి రోమన్లు దండెత్తి వచ్చారు. ఆ నగరంలోనే ఆర్కిమెడిస్ ఉన్నాడు. యుద్ధంలో గ్రీకులు ఓడిపోయారు. దాంతో రోమన్ సైనికులు నగరంలో స్వైరవిహారం ప్రారంభించారు. ఓ సైనికుడు ఆర్కిమెడిస్ ఉన్న భవనంలోకి ప్రవేశించాడు. అక్కడ ఆర్కిమెడిస్ తన అధ్యయనంలో మునిగిపోయి ఉన్నాడు. తన వెంట రమ్మని సైనికుడు ఆదేశిస్తే.. పుస్తకంలోంచి తల పైకెత్తి.. "నేను చాలా ముఖ్యమైన పనిలో ఉన్నాను. ఇప్పుడు అంతరాయం కలిగించకు!" అని ఆర్కిమెడిస్ తిరిగి తన పనిలో పడ్డాడు. దీంతో కోపంతో సైనికుడు కత్తితో పొడిచి ఆర్కిమెడిస్ ను చంపేశాడు. నిజానికి, ఆ సైనికునికి తాను చంపుతున్నది ఓ గొప్ప శాస్త్రవేత్తనని తెలియదు. తర్వాత, ఈ విషయం తెలిసిన రోమన్ కమాండర్ మార్సెల్లెస్ చాలా బాధపడ్డాడు.

2008/12/05

ఐన్‌స్టీన్, మంచి మాట - 26


ఇబ్బందులు కొత్త శక్తిని తెచ్చిపెడతాయి, మన ఆలోచనలకు పదునుపెడతాయి.
- ఆల్బర్ట్ ఐన్‌స్టీన్