2007/10/10

నోబెల్ ప్రైజ్ కు ఆవగింజపాటి విలువలేదా?నోబెల్ ప్రైజ్, డైనమైట్ ను కనుగొన్న స్వీడన్ శాస్త్రవేత్త ఆల్ ఫ్రెడ్ నోబెల్ పేరిట ఈ ప్రైజ్ లను ప్రదానం చేస్తారు. సైన్స్, సాహిత్యం, శాంతి విభాగాల్లో విశేష కృషిచేసిన వారికి వీటిని అందజేస్తారు. మన దేశ స్వాతంత్ర్య ఉద్యమాన్ని రక్తపాత రహితంగా, సత్యాగ్రహం-అహింసలే అయుధాలను చేసుకొని పోరాడిన మహాత్మాగాంధీకి ఇవ్వని నోబెల్ శాంతి బహుమతికి గౌరవం ఉన్నదో లేదో తెలియదు కానీ.. నోబెల్ ప్రైజ్ కు శాస్త్రప్రపంచంలో చాలా గొప్ప గౌరవస్ధానంలో ఉన్నది. ప్రతి శాస్త్రవేత్తా.. దాని కోసం కలలుగంటారు. ప్రైజ్ మాట అటుంచి.. నోబెల్ కమిటీ పరిశీలనకు తన పేరు వచ్చినా గొప్ప గౌరవంగా భావిస్తారు. అయితే, అటువంటి అత్యున్నత పురస్కారానికి ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆవగింజంత విలువ కూడా ఇవ్వకపోవటం గమనార్హం. 1922లో ఐన్‌స్టీన్ కు నోబెల్ బహుమతి లభించింది. అయినప్పటికీ.. తను రోజూ రాసుకునే డైరీలో గానీ.. తరచుగా మిత్రులకు రాసే ఉత్తరాల్లో గానీ.. ఐన్‌స్టీన్ కనీసం ఆ విషయాన్ని కూడా ప్రస్తావించలేదు. అంతేకాదు, చాలాసందర్భాల్లో తనకు ఆ ప్రైజ్ వచ్చిన విషయాన్ని కూడా ఆయన వెల్లడించేవారు కాదు. కానీ రెండవ ప్రపంచ యుద్ధము కాలంలో ప్రత్యక్ష హింసను చూసిన ఐన్‌స్టీన్, అవకాశం వచ్చినప్పుడు అహింస గురించి, నోబెల్ మాన్(గాంధీజీ) గురించి తప్పక మాటలాడేవారు.

2007 సంవత్సరపు నోబెల్ ప్రైజ్ సంబరాలు మెదలైనవి, ఇప్పటికే వైద్య(ఆలీవర్ స్మిత్తీస్, మారియో కాపెచ్చి, మార్టిన్ ఇవాన్స్ లకు కలిపి), భౌతిక(అల్బర్ట్ ఫెర్ట్, పీటర్ గ్రూన్ బర్గ్ లకు కలిపి), రసాయన(గెర్హార్డ్ ఎర్టల్) శాస్త్ర విభాగాలకు అవార్డులను ప్రకటించారు (వాటి మర్మ-మరాలు త్యరలో..).

2 అభిప్రాయాలు:

చదువరి said...

గాంధీకి శాంతి బహుమతి -ఇస్తే మహాత్ముడికి ప్రత్యేకించి ఒరిగేదేం లేదు, ఆ పురస్కారానికే విలువొస్తుంది గానీ! గాంధీ పేరిట భారత ప్రభుత్వం శాంతి బహుమతి ఇస్తోంది..., అది గాంధీ పట్ల మన ప్రభుత్వం చెయ్యగలిగిన మరింత విలువైన పని అని నా ఉద్దేశ్యం.

మరమరాలు said...

చదువరి గారు మీరు చెప్పినది అక్షరాల నిజం, మీ వాఖ్యలకు నా నెనర్లు.

Post a Comment

Thank you for your comments