
అజ్ఞానులు గతాన్ని గురించి, బుద్ధిమంతులు వర్తమానాన్ని గురించి, మూర్ఖులు భవిష్యత్తును గురించి మాట్లాడతారు.
"ఎందరో మహానుభావులు అందరికీ వందనములు"
ప్రపంచములో ఎందరో శాస్త్రవేత్తల పరిశోధనలు, మహానుభావుల మాటలు, త్యాగధనుల సమీష్టి కృషి ఫలితం ఈనాడు మనకు కనపడే ఈ అబివృద్ది. నేను సేకరించిన కొంత మంది మహానుభావుల అడుగుజాడలను మీకు తెలియజేయ ప్రయత్నమే ఈ "మర్మ-మరాలు".
హైదరాబాద్ లో జరిగిన పేలుళ్లు అత్యంత బాధాకర సంఘటన. ఇది మనందరికి సవాల్ గా నిలిచింది. ఇలాంటి సంఘటనలు పునరావూతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనా, సమాజంపైనా ప్రధానంగా యువతపై ఉంది. వాటిని మన బ్లాగ్గులు చాలా బాగా విశ్లేషించారు. కాని మనం ఏమి చేయాలి.
*గాయపడిన వారికి సాయం చేద్దాం.
*పేలుళ్లు జరిగినప్పుడు మనం ఆప్రమత్తముగా ఉండి, ఒనర్ లేని బ్యాగులు గురించి పోలీసులుకి ఫోను చేద్దాం.
*రాజకీయ బంద్ లకు దూరంగా ఉండి, సంఘిభావం ప్రకటింతము. తీవ్రవాదుల దుశ్చర్యకు అనవసరంగా ప్రాధాన్యం పెరగకుండా చూద్దాం.
*వైద్యశాలకు సహయం చేద్దాం.
*ఐకమత్యానికి అసలు చావన్నదే లేదు, మీకు మేము కూడా ఉన్నాము అని నీ చేయి అసరా ఇవ్వు.
సుమారు కోటిన్నరమంది చూసిన 'యూ ట్యూబ్' వెబ్ సైట్ లోని 'బ్యాటిల్ ఎట్ క్రూగర్' వీడియ్ కధ చూడండి. ఇది ఐకమత్యపు బలాన్ని మరోసారి చాటిన కధ. 'టీమ్ వర్కు' కు సాదించిన విజయం. ఈ కధ గురించి ఈనాడు లో కూడా వచ్చింది, చదవండి.
దున్నపోతుల సమాజం మేలుకుంది. తోటి జీవిపై జరిగిన దాడి వాటిని స్పందింపజేసింది. ప్రతీకారేచ్ఛ రగిలింది. కొమ్ముల్లోకి కొత్తశక్తి ప్రవాహించింది. ఆలోంచి, ఒక్కొక్కటే కదిలాయి. పక్కా ప్రణాళికతో నడుస్తున్నట్టుగా.. సమర్ధుడైన నాయకుడు దారిచూపుతున్నట్టుగా.. సూన్-జు యుద్ధకళ( ఆర్ట్ ఆఫ్ వార్) కు తామే స్ఫూర్తి అయినట్టుగా.. పదులకొద్దీ దున్నలు. సింహుల తుక్కు రేగ్గొట్టాయి.. చూడండి.
1930 లో భౌతికశాస్త్రంలో సి.వి.రామన్ నోబెల్ ప్రైజ్ అందుకున్నారు. ఆ ఏడాది ప్రైజ్ కచ్చితంగా తనకే వస్తుందన్న నమ్మకం ఉన్న రామన్.. ఫలితాలు వెలువడకముందే.. స్వీడన్ లో జరిగే నోబెల్ బహుమతుల ప్రదానోత్సవానికి తనకూ, తన భార్యకు స్టీమర్ లో సీట్లు బుక్ చేసేశారు. ఇక, బహుమతినందుకుంటున్న సమయంలో.. రామన్ కళ్లు చెమర్చాయి. ఆనందంతో కాదు.. బాధతో. ఆ సమయంలో కూడా.. తనపక్కన బ్రిటన్ జెండా చూసి.. తనదేశానికి ఒక జెండా లేకపోయిందే అన్న బాధతో ఆయన హృదయం క్షోభించింది. రామన్, మీకు 60 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
ఒక రంగంలో విపరీతమైన ఇష్టం ఉన్నవారికి ఇక వేరే వాటి గురించి ఏమాత్రం పట్టదు. దానిద్వారా ఎన్ని నష్టాలు సంభవిస్తున్నా.. తమ ధోరణిని మార్చుకోరు. ఇటువంటి వారు చాలా అరుదు. వారిలో.. ప్రఖ్యాత భారతీయ గణితశాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ (1887-1920) ఒకరు. లెక్కల్లో తన తరగతికన్నా ఎంతో పెద్దవారికి సైతం పాఠాలు చెప్పగల రామానుజన్.. ఇతర సబ్జెక్టుల్లో మాత్రం పాస్ మార్కులు కూడా తెచ్చుకునేవారు కాదు. ఫలితంగా.. ఆయన కనీసం డిగ్రీ కూడా సాధించలేకపోయారు. అయితే, ఆయన ప్రతిభను కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం గుర్తించింది. గణితశాస్త్రానికి రామానుజన్ చేసిన సేవలను గుర్తిస్తూ..బీఏ డిగ్రీని ఇచ్చి గౌరవించింది.
ప్రఖ్యాత భారతీయ ఖగోళ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత చంద్రశేఖర సుబ్రహ్మణ్యం (1910-1995) మరణించినప్పుడు.. "విశ్వంలోని నక్షత్రాలన్నీ అనాథలయ్యాయి" అని ప్రపంచ పత్రికలు రాశాయి. దీని వెనక ఒక నేపథ్యం ఉంది. చంద్రశేఖర్ ను ఒక సందర్భంలో ఓ విలేకరి ఇంటర్వ్యూ చేశారు. ఆయన సిధ్ధాంతాలు, పరిశోధనల గురించి అడిగిన తర్వాత వ్యక్తిగత విషయాల పై దృష్టి సారించారు. మీకు ఎంత మంది పిల్లలు అని అడిగారు. దానికి సరదాగా జవాబిస్తూ.. అనంత విశ్వంలో ఉన్న నక్షత్రాలన్నీ నా సంతానమే! అని చంద్రశేఖర్ చెప్పారు. వాస్తవమేమిటంటే ఆయనకు సంతానం లేదు. ఈ ఇంటర్వ్యూ అనేక మంది దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా చంద్రశేఖర్ చెప్పిన సరదా సమాధానం చాలామంది శాస్త్రవేత్తలకు ఆసక్తిదాయకమైంది. తర్వాత ఆయన మరణించినప్పుడు.. నక్షత్రాలు అనాధలయ్యాయంటూ చంద్రశేఖర్ కు పత్రికలు నివాళులు అర్పించాయి..