2007/11/15

క్వార్జ్ పేరడీ



సాహిత్యంలో పేరడీలకు లోటేమీ లేదు. ప్రసిద్ధ కవుల కవితల పైనా, పాటల పైనా పేరడీలు కట్టి.. పదిమందీ నవ్వుకోవటం సాధారణంగా జరిగే పనే. ఇటువంటి ప్రయోగాలు సైన్స్ లోనూ ఉన్నాయి. ప్రాధమిక కణాల్లో ఒకటైన క్వార్జ్ ను కనుక్కున్నందుకు అమెరికా శాస్త్రవేత్త ముర్రె గెల్ మన్(1929) కు నోబెల్ బహుమతి లభించింది. ఆ సందర్భంగా, విలేకరుల సమావేశం ఏర్పాటైంది. చాలామంది శాస్త్రవేత్తలున్నారు కదా.. మీకే బహుమతి లభించటానికి కారణమేమిటి.. అని ఒక పాత్రికేయుడు గెల్ మన్ ను ప్రశ్నించారు. దానికి ఆయన చెప్పిన సమాధానానికి.. కొందరు నవ్వుకుంటే.. కొందరేమో ఇంత పొగరా అని ముఖం చిట్లించుకున్నారు. ఇంతకూ గెల్ మన్ చెప్పిందేమిటంటే.. "నా చుట్టూ మరుగుజ్జులే ఉన్నారు. అందుకే నేనీ ప్రైజ్ గెల్చుకున్నా" అని. న్యూటన్ (1643-1727) అన్న మాటలకు పేరడీగా ఆయన అలా అన్నారు. "మహామహుల భుజాల మీద నిల్చొన్నా కాబట్టే.. ఇతరుల కంటే కాస్త ముందుకు చూడగలుగుతున్నా" అన్న న్యూటన్ ప్రసిద్ధ వ్యాఖ్య తెలిసిందే కదా!

0 అభిప్రాయాలు:

Post a Comment

Thank you for your comments