2008/01/19

జార్జ్ 'ఎవరెస్ట్'ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వతం ఏది అంటే ఎవరెస్ట్ అని ఠక్కున చెబుతాం. ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే మాత్రం.. సమాధానం దొరకదు. ఇంతకీ ఈ పర్వతరాజుకు ఆ పేరు ఎలా వచ్చింది? భారతదేశ భౌగోళిక స్వరూపాన్ని శాస్త్రీయంగా లెక్క గట్టీ పటాలను రూపొందించే ప్రక్రియ ఆంగ్లేయుల పాలనలో తొలిసారిగా మొదలైంది. గ్రేట్ ఆర్క్ అనే సంస్ధకు ఈ బాధ్యతను అప్పగించారు. ఆ సంస్ధ సర్వేయర్ జనరల్ సర్ జార్జ్ ఎవరెస్ట్ (1790-1866) ఆధ్వర్యంలో పనులు మొదలైనాయి. అన్ని ప్రాంతాలను లెక్కిస్తూ.. ఓ పెద్ద పర్వతం దగ్గరికి వచ్చారు. లెక్కలు పూర్తయ్యాక తేలిందేమంటే ప్రపంచంలోనే దాన్ని మించింది లేదని. ఇక పేరు పెట్టటం మిగిలింది. అప్పటికే స్ధానికులు రకరకాల పేర్లతో దానిని పిలుస్తున్నప్పటికీ.. ఆంగ్లేయుల ప్రామాణికంగా ఒక పేరు లేదు. ఈ నేపధ్యంలో.. ఆ పర్వతానికి జార్జ్ ఎవరెస్ట్ పేరుమీదుగా.. మౌంట్ ఎవరెస్ట్ అని పిలవాలని ఒక ఉద్యోగి సూచించారు. అందరూ ఆమోదించటంతో.. ఆ పేరే నిలిచిపోయింది.

3 అభిప్రాయాలు:

Anonymous said...

chaalaa baagunnaayi mee posts thank you

Anonymous said...

chaalaa baagunnaayi mee posts thank you

sreenyvas said...

"ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వతం ఏది అంటే ఎవరెస్ట్ అని ఠక్కున చెబుతాం. ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే మాత్రం.. సమాధానం దొరకదు."

నాదీ అదే పరిస్థితి :-( కానీ నేటితో ఆ స్థితి మారింది. నెనర్లు.

Post a Comment

Thank you for your comments