2007/09/20

పోరాటం, సాహాసం, లక్ష్యసాధనల సమ్మేళనమే టాటాల చరిత్ర: జంషెట్ జీ (జేఎన్) టాటా గురించి..

సొంతంగా డబ్బు సంపాదించటం - ఇతరుల కోసం సంపదను సృష్టించటం ఈ రెంటి మధ్య తేడా ఉంది. దేశానికే సంపదను సృష్టించి పెట్టిన చరిత్ర టాటాలది. పోరాటం, సాహాసం, లక్ష్యసాధనల సమ్మేళనమే టాటాల చరిత్ర.
భారత పారిశ్రామిక పురోగమనానికి పునాదులు వేసిన టాటా హౌస్ వ్యవస్ధాపకుడు
జంషెట్ జీ నుసుర్ వాన్ జీ (జేఎన్) టాటా (1839-1904), 1839లో పార్శీ మత గురువుల కుటుంబంలో జన్మించారు. 1868లో ఆయన ఒక ప్రైవేటు వ్యాపార సంస్ధను ప్రారంభించటంతో దేశ పారిశ్రామిక చరిత్రలో కొత్త శకం ఆరంభమైంది. 1874లో సెంట్రల్ ఇండియా స్పిన్నింగ్, వీవింగ్ అండ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీని; 1887లో టాటా స్నన్స్ ను నెలకొల్పారు. అప్పట్లోనే ఆయన ప్రపంచంలోని అత్యంత అభివుద్ధి చెందిన దేశాల సరసన భారత్ ను నిలబెట్టాలని భావించారు. ఫలితంగా ఏర్పడిందే టిస్కో మరియు టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్. ఖనిజ సంపద సమృద్థిగా లభించే బీహార్ లోని సక్చి (ఇప్పుడు జంషెడ్ పూర్ గా మారింది) వద్ద 1907లో టాటా ఇనుము-ఉక్కు కర్మాగారం(టిస్కో) నెలకొల్పారు. బ్రిటిష్ వలస రాజ్యంలో అందునా ఓ భారతీయుడు ఉక్కు కర్మాగారం నెలకొల్పటం పెద్ద సంచలనమే అయింది. ఆరంభంలో ఈ కంపెనీ సమస్య ఎదుర్కొన్నా, 1912లో తొలి ఉక్కు దిమ్మె కర్మాగారం నుంచి బయటకు వచ్చింది.

ఇంకా జంషెడ్ జీ తన మానస పుత్రికగా భావించి నెలకొల్పిన టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, బెంగుళూరు. ఈ సంస్ధే నేడు
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (IISc) గా రూపాంతరం చెంది వ్యవస్ధాపకుల కలలను నిజం చేస్తూ, దేశంలో విజ్ఞాన శాస్త్రాభివృద్థికి తోడ్పడుతోంది. జంషెట్ జీ తన ఇద్దరు కొడుకులతో పాటు ఈ సంస్ధకు కూడా తన ఆస్తిలో సమాన వాటా ఇస్తూ వీలునామా రాయడాన్ని బట్టి దీని ప్రాధాన్యాని అర్ధం చేసుకోవచ్చు. భవిష్యత్ భారతంలో ఓ పారిశ్రామిక మహాసామ్రాజ్య నిర్మాణానికి పునాదులు వేసిన జంషెట్ జీ 1904లో యూరోప్ వెళ్ళినప్పుడు అదే ఆయనకు తుది పయనం అవుతుందని ఆనాడు ఎవరూ అనుకోలేదు. జర్మనీలో ఉండగా ఆయన తీవ్ర అస్వస్ధతకు లోనయ్యారు. తనకు చివరి రోజులు సమీపించాయని గ్రహించిన జంషెట్ జీ... పక్కనే ఉన్న తన సోదరుడి కుమారుడు రతన్ జీ దాదాభాయ్ తో, సోదరులంతా కలసి టాటా పారిశ్రామిక సామ్రాజ్యాన్ని ప్రగతిపధంలోకి తీసుకువెళ్లాలని కోరారు. టాటాల పేరు మీద కొనసాగటం అంత తేలికైన విషయం కాదని చెబుతూ... "మీరు ఆ పేరుకు మరింత హుందాతనాన్ని జోడించకయినా ఫర్వాలేదు కాని, కనీసం దాన్ని కాపాడండి. పతనం కానివ్వద్దు. నేను వదలి వెళ్తున్న పనిని కొనసాగించండి. ఇప్పటికే చేసిన పనిని మాత్రం చెడగొట్టకండి" అని ఉద్బోధించారు. క్రమేణా ఆరోగ్యం క్షీణించడంతో మే 19న ఆయన రాత్రి నిద్రలోనే అంతిమశ్వాస విడిచారు.

4 అభిప్రాయాలు:

మేధ said...

టాటాల గురించి ఇంకో విషయం కూడా ఉంది..

మన దేశంలో అత్యధిక ధనవంతుల జాబితాలో టాటాలు ఎప్పుడూ ఉండరు.. దానికి కారణం కంపెనీకి వచ్చే లాభాలలో 40% ఛారిటీలకి వెళుతుంది.. మిగతా 60% ఉద్యోగుల జీతభత్యాలు, కంపెనీ అభివృధ్ధికి ఉపయోగిస్తారు.. అందుకే రతన్ టాటా గారి పేరు ఆ జాబితాలో ఉండదు...

Unknown said...

నేను కూడా టాటా కంపనీలో రెండు సంవత్సరాలుగా పని చేస్తున్న. ఇక్కడ ఉంటే, ఎదో మన కోసమే పని చేసినట్టు ఉంటుంది నాకు..

చదువరి said...

మన పారిశ్రామికవేత్తల్లోకెల్లా టాటాలు విశిష్టమైన వాళ్ళు.

Burri said...

మేధ గారు, ప్రదీప్ గారు, చదువరి గారు టాటాల గురించి చక్కటి విశ్లేషణను రాసిన మీ అందరీకి నా బ్లాగ్ అభివందనాలు.

Post a Comment

Thank you for your comments