ప్రపంచములో ఎందరో శాస్త్రవేత్తల పరిశోధనలు, మహానుభావుల మాటలు, త్యాగధనుల సమీష్టి కృషి ఫలితం ఈనాడు మనకు కనపడే ఈ అబివృద్ది. నేను సేకరించిన కొంత మంది మహానుభావుల అడుగుజాడలను మీకు తెలియజేయ ప్రయత్నమే ఈ "మర్మ-మరాలు".
: నా పేరు రఘునాధ రెడ్డి బుర్రి. మా నాన్నగారి పేరు శ్రీనివాసరెడ్డి. అమ్మ పేరు వెంకట్రామ్మ. అన్న పేరు రంగారెడ్డి. నేను గుంటూరు జిల్లా “కరాలపాడు” అనే గ్రామం లో పుట్టాను.
పురుషులతో పాటు స్త్రీలూ సమానం అనే అర్ధం వచ్చేవిధంగా... ఆకాశంలో సగం మహిళలదే అంటూంటాం. అయితే, ఈ సమానత్వం రావటానికి ముందు మహిళాలోకం తీవ్రమైన వివక్షను ఎదుర్కొంది. అదీఇదని కాదు.. అన్ని రంగాల్లోనూ ఈ అసమానత్వం రాజ్యమేలింది. దీనికి ఒక ఉదాహరణ.. సోఫీజర్మేన్ (1776-1831) జీవితం. సోఫీ ప్రఖ్యాత ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త. అయితే, ఆమె పరిశోధన పత్రాలను, వ్యాసాలను తన పేరుతో రాసేవారు కాదు. తన పేరు తెలిస్తే.. పురుషాధిక్య సమాజం రుకోదని భయపడి.. ఎమ్. లెబ్లాంక్ అనే మారు పేరుతో వ్యాసాలను రాసేవారు. ఇతర శాస్త్రవేత్తలకు రాసే.. ఉత్తరాల్లోనూ ఆమె ఈ పేరునే ఉపయోగించేవారంటే.. ఆనాటి పరిస్ధితలు ఎంత తీవ్రంగా ఉండేవో వూహించుకోవచ్చు.. ఏదిఏమైనా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకంక్షలు.