2009/03/08

వివక్షకు గురి అయిన ప్రఖ్యాత మహిళ శాస్త్రవేత్త: మహిళా దినోత్సవ సందర్భంగా...


పురుషులతో పాటు స్త్రీలూ సమానం అనే అర్ధం వచ్చేవిధంగా... ఆకాశంలో సగం మహిళలదే అంటూంటాం. అయితే, ఈ సమానత్వం రావటానికి ముందు మహిళాలోకం తీవ్రమైన వివక్షను ఎదుర్కొంది. అదీఇదని కాదు.. అన్ని రంగాల్లోనూ ఈ అసమానత్వం రాజ్యమేలింది. దీనికి ఒక ఉదాహరణ.. సోఫీజర్మేన్ (1776-1831) జీవితం. సోఫీ ప్రఖ్యాత ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త. అయితే, ఆమె పరిశోధన పత్రాలను, వ్యాసాలను తన పేరుతో రాసేవారు కాదు. తన పేరు తెలిస్తే.. పురుషాధిక్య సమాజం రుకోదని భయపడి.. ఎమ్. లెబ్లాంక్ అనే మారు పేరుతో వ్యాసాలను రాసేవారు. ఇతర శాస్త్రవేత్తలకు రాసే.. ఉత్తరాల్లోనూ ఆమె ఈ పేరునే ఉపయోగించేవారంటే.. ఆనాటి పరిస్ధితలు ఎంత తీవ్రంగా ఉండేవో వూహించుకోవచ్చు.. ఏదిఏమైనా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకంక్షలు.

3 అభిప్రాయాలు:

Anonymous said...

గురైనా అంటే గురైనప్పటికీ అనే అర్థం వస్తోంది.
గురైన... సరైనది.

Pradeep Miriyala said...

నిజమే. ఈవిడ గురించి నేను E=mc^2 video లో చూసాను.

Burri said...

@తాడేపల్లి గారికి, @ప్రదీప్ గారికి మీ అభిమానానికి నెనర్లు.

Post a Comment

Thank you for your comments