2008/02/05

శాస్త్రాభిమానం


మామూలుగా రాజులు, చక్రవర్తులు అనగానే యుద్ధాల్లో మునిగి తేలేవారనో, సుఖాల్లో ఓలలాడేవారనో మనకు అనిపిస్తుంది. చరిత్రలో దీనికి కోకొల్లలుగా సాక్ష్యాలున్నాయి కాబట్టే ఈ అభిప్రాయం స్ధిరపడిపోయింది. అయితే, కొద్దిమంది మాత్రం ఈ జాబితాలోకి ఎక్కరు. వారిలో ఫ్రెంచ్ పాలకుడు నెపోలియన్ (1769-1821) ఒకరు. ఈ ప్రపంచ ప్రఖ్యాత చక్రవర్తికి గణితం అన్నా, సైన్స్ అన్నా విపరీతమైన అభిమానం. ఈ అభిమానానికి తన దేశం, పరదేశం అన్న పరిమితులు కూడా ఉండేవి కావు. ఎక్కడ మంచి ఆవిష్కరణ జరిగినా, మంచి పరిశోధన గ్రంధం వెలువడినా ఆ శాస్త్రవేత్తను, రచయితను ఫ్రాన్స్ కు ఆహ్వానించి, ఆదరించి ఆ అంశంమైన మాట్లాడించుకునేవారు నెపోలియన్. వేర్వేరు భాషల్లో ఉన్న శాస్త్రీయ గ్రందాలను ఫ్రెంచ్ భాషలోకి అనువదింపజేసేవారు.

1 అభిప్రాయాలు:

oremuna said...

అవును.. అంట! రొజెట్టా స్టోన్ కూడా నెపోలియన్ ఆర్డర్స్ వల్లనే ఫ్రెంఛ్ మొత్తం కాపీలు తియ్యబడిందంట!

Post a Comment

Thank you for your comments