2007/09/13

ఐన్‌స్టీన్ మతిమరుపు

గొప్ప శాస్త్రవేత్తల పరిశోధనలే కాదు.. మతిమరుపు కూఢా అందరికీ ఆసక్తిని కలిగిస్తుంది. ప్రస్తుతం ఐన్‌స్టీన్ మతిమరుపును చూద్దాం. సిద్ధాంతాల గొడవలో రోజుల తరబఢి శ్రమించే ఈ మహాశాస్త్రవేత్త సేదదీరేందుకు కొన్ని పనులు చేసేవారు. వీటిలో వయోలిన్ వాయించటం, పిల్లలతో కలసి ఆడుకోవటం ముఖ్యమైనవి. ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా ఉన్న రోజులో ఒకసారి ఇలాగే ఐన్‌స్టీన్ స్ధానికంగా ఉన్న చిన్నపిల్లల పాఠశాలకు వెళ్లారు. వయోలిన్ వాయించి వారిని సంతోషపెట్టి, వారికొచ్చిన బుల్లిబుల్లి సందేహాలను తీర్చి రోజంతా సరదాగా గడిపారు. ఇక వెళదామని అనుకుంటున్న సమయంలో కొంతమంది పిల్లలు.. "అంకుల్! మీ ఇంటి అడ్రస్ చెప్పరా? మేం కావాలనుకున్నప్పుడు వస్తాం!" అని అడిగారు. అప్పటిదాకా ఎన్నో సందేహాలు తీర్చిన ఐన్‌స్టీన్ ఈ ప్రశ్నకు మాత్రం వెంటనే సమాధానం చెప్పలేకపోయారు. ఎందుకంటే ఎంత తన్నుకున్నా ఇంటి అడ్రస్ ఆయనకు గుర్తుకు రాలేదు. చాలాసేపు తంటాలు పడిన తర్వాతగానీ అడ్రస్ చెప్పలేకపోయారు.

6 అభిప్రాయాలు:

బ్లాగాగ్ని said...

ఐన్ స్టీన్ కి చెందిందే మరో సరదా సంఘటన. ఒకసారి ఐన్ స్టీన్ కోడిగుడ్డు ఉడకడానికి ఎంత సమయం తీసుకుంటుందో తెలుసుకోవాలని మరిగే నీళ్ళల్లో గుడ్డువేసి మరో చేతిలో వాచి పట్టుకుని ఏవో ఆలోచనల్లో మునిగిపోయాడట. కాస్సేపటికి గుడ్డు విషయం గుర్తొచ్చి నీళ్ళగిన్నెలోకి చూస్తే వాచి కనబడింది.

రఘునాధ రెడ్డి బుర్రి said...

బ్లాగాగ్ని గారు మీరు రాసిన సరదా సంఘటన చాలా బాగుంది, ధన్యవాదాలు.

మేధ said...

ఇది మతిమరపు సంఘటన కాదు.. కానీ ఆయన జీవితంలో జరిగిన సంఘటన..

ఐన్ స్టీన్ తో పాటు ఆయన డ్రైవర్ కూడా అన్ని చర్చలకి హాజరు అవుతూ ఉండేవాడు.. దాంతో అతనికి కూడ సైన్స్ కి సంబందించిన పరిజ్ఞానం కొంత వంటబట్టింది.. అయితే ఒకసారి ఒక చర్చకి ఐన్ స్టీన్ గారిని ఆహ్వానించారు.. దానికి ఆ డ్రైవర్ మీ బదులు నేను వెళతాను, మీరు నా డ్రైవర్ లాగా సభికులలో కూర్చోండి అని అంటే దానికి ఐన్ స్టీన్ సరే అని అన్నారు… సరే చర్చ మొదలైంది.. వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికి సంతృప్తికరమైన సమాధానాలనే ఇచ్చారు డ్రైవర్ గారు.. ఇక చర్చ ముగిసిన తరువాత స్టేజీ దిగి వస్తుండగా, ఒకాయన కొంచెం క్లిష్టమైన ప్రశ్న వేశారు.. దానికి ఐన్ స్టీన్ వేషంలో ఉన్న డ్రైవర్ పెద్దగా నవ్వి దీనికి నేను ఎందుకు మా డ్రైవర్ చెబుతాడు అని అసలు ఐన్ స్టీన్ ని పిలిచారు.. ఆ ప్రశ్నకి నిజం ఐన్ స్టీన్ గారు సరియైన సమాధానం చెప్పారు.. దాంతో ఆ చర్చ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా పూర్తైంది.. అందుకేనేమో ఆరునెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు అని అంటారు..!!

మరమరాలు said...

మేధ గారు మీరు రాసిన సంఘటన చాలా బాగుంది, ధన్యవాదలు. ఇంకా చాలామంది మహానుభావులకి త్యరలో పెడతాను నా ప్రసాదం..

వింజమూరి విజయకుమార్ said...

విజయీభవ! ఆర్యా రఘనాథ రెడ్డి గారూ. మీ భ్లాగు సెప్టెంబరు నెల 'తేనెగూడు' Top Ten లో వచ్చినందుకు మిమ్నల్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అందుకోండి నా శుభాభినందనలు.

మరమరాలు said...

విజయకుమార్ గారు మీ అభినందనలకు నా నెనర్లు.

Post a Comment

Thank you for your comments